మదిలో నా ప్రతి ఆలోచనలో నువ్వు ఉన్నావు
మౌనంగా ఉన్న క్షణం లో జ్ఞాపకానీవై ఉన్నావు
బాధలొ ఓదార్పుగా సంతోషం లో బాగంగా
చేసే ప్రతి పని లో నువ్వే వున్నావు..
కానీ నేడు కనులు తెరిచి చూసే అంతదూరం లో లేవు నేస్తామా
ఈ దూరం శాశ్వతం కాదని మనసుకు తెలిసినా
ఎందుకో ఆది నీకోసం కలవరింత మాత్రం ఆపడం లేదు
పిచ్చి దానిలా నీ పలకరింపుకై
నీ చూపుకై ఎదురుచూస్తూనే ఉంది
ఓదార్చగా ఒక చిన్న మాట లా చెప్పి వెళ్లు నేస్తామా నీవు నాతోనే ఉన్నావని.
ఎప్పుడు వదిలివేళ్లవని.
నీకోసమై తపిస్తున్న ఈ పిచ్చిమనసు
No comments:
Post a Comment