నిన్నే ఆరాధిస్తున్నాను నా ప్రియతమా
నీకై ఆలాపిస్తున్నాను అనుదినం
నీకై వేచే ప్రతి నిముషం నాకో తీయటి అనుభవం
అక్షర ప్రేమలు జీవం పోసుకొని
కవితలు గా నిన్ను ఆరాధిస్తున్నాను
కలవరపడిన నా మనసుని చూసి ఓధార్చ రావ నా హృదయమా
పదే పదే గురుతు వచ్చే నీ ప్రేమని మరచి నే మనగలనా
నా అనుమతి లేకుండానే నీ గుండెలో చోటిచ్చావు
నే అడుగుతున్నా చెంత రాక వేదిస్తున్నావు సఖి
నీ ఆరాధనలో ఆశలు పెంచుకుంటున్న నీ ప్రియసఖి
No comments:
Post a Comment