Search This Blog

Thursday, December 31, 2009

Happy Happy Newyear

Happy Happy Newyear
సంతోషం పెరగాలి
గుండెలోని బాధల్ని మరచిపోవాలి
రెక్కలు వచ్చిన మనసులా
ఆ నింగికి ఎగిరే పక్షిలా
ఆనందం అంతా సొంతం చేసుకోవాలి
ఈ New year అంతా

కొత్త సంవత్సరం

ఎప్పటికప్పుడు జీవితానికి
కొత్త సంవత్సరం మహా గొప్పగా ఉంటుంది
పాత చెత్తను ఉడ్చేస్తూ
కొత్త చెత్తను ఎంచుకొని
ఇరావైలోనో...... అరావైలోనో "ఎప్పటికప్పుడు"
మార్పులేని కాలంతో
మారని బ్రతుకులతొ
నిత్య దిన చర్యతో
ఒక్కోసారో.........వందసార్లొ " ఎప్పటికప్పుడు"

చెదరని రాతలతో
తీరని కష్టాలతో
మార్పు లేని జీవితంలో
నీకైనా,,,,,, నాకైనా,,,,,,,ఎవరికైనా " ఎప్పటికప్పుడు"

కొత్త కొత్త ఆశలతొ
కొత్త కొత్త ఆశయాలతో
మళ్లీ మళ్లీ " ఎప్పటికప్పుడు"
కొత్త సంవత్సరం గురుంచి ఆలోచించొద్దు
వచ్చిన తర్వాత పాత సంవత్సరమే కదా

శుభాకాంక్షలు


శుభాకాంక్షలు నేస్తమా

నీవు చెంతలేని ఈ క్షణాన

నా జ్ఞాపకాలనే wishes గా చేసి

నీ జ్ఞాపకాలకు రూపం పోసి

తెలుపుతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు

Good Bye 2009 - Welcome 2010


2 two (too) Much tragedy ki goodby cheppi

00 thousand (s) of kothha aashala kosam

9 nin(n)e vadilesthunnamu goodbye 2009


2 two (too) much happiness kosam

00 thousand(s) of ambitions tho

10 ten loki parigeduthunnamu santoshamtho
welcome 2010

New year


New year వచేస్తుంది ఉగాది లా ఉశస్సులు తెచ్చేస్తుంది

మనసులోని బాదల్ని, కల్మషాన్ని కాల్చేసి

నవ జీవితానికి నాంది పలికేలా ఆహ్వానిస్తున్నాం

ఈ New year ని

నూతన సంవత్సరం

వచేస్తుంది వచేస్తుంది నూతన సంవత్సరం వచేస్తుంది
సరికొత్త ఆశలతొ ,మరో కొత్త ఉషోదయం తో
అపుడే గడచిపోయిన నిన్నటిలాంటి ఈ ఏడుకు ముగింపు చెపుతూ
ఇపుడే వస్తున్న సరికొత్త ఏడుకు స్వాగతం చెపుతూ
సంబరాలతో, సందడి తో చేసుకుంటున్న నూతన సంవత్సరానికి
ఇదే ఇదే మన అందరి స్వాగతం

Wednesday, December 16, 2009

స్నేహం


స్నేహం ముదిరి ప్రేమగా మారితే

దానికి స్వార్థం అనే రంగు పూసుకొని

స్వచమైన స్నేహానికి రెక్కలు కట్టించి

గమ్యం లేని పయనం లోకి తోసేస్తుంది

Tuesday, December 1, 2009

ప్రియసఖి


నిన్నే ఆరాధిస్తున్నాను నా ప్రియతమా

నీకై ఆలాపిస్తున్నాను అనుదినం

నీకై వేచే ప్రతి నిముషం నాకో తీయటి అనుభవం

అక్షర ప్రేమలు జీవం పోసుకొని

కవితలు గా నిన్ను ఆరాధిస్తున్నాను

కలవరపడిన నా మనసుని చూసి ఓధార్చ రావ నా హృదయమా

పదే పదే గురుతు వచ్చే నీ ప్రేమని మరచి నే మనగలనా

నా అనుమతి లేకుండానే నీ గుండెలో చోటిచ్చావు

నే అడుగుతున్నా చెంత రాక వేదిస్తున్నావు సఖి

నీ ఆరాధనలో ఆశలు పెంచుకుంటున్న నీ ప్రియసఖి

Monday, November 30, 2009

ఈ పిచ్చి మనసు

మనసులో నా తోనే వున్నావు .
మదిలో నా ప్రతి ఆలోచనలో నువ్వు ఉన్నావు
మౌనంగా ఉన్న క్షణం లో జ్ఞాపకానీవై ఉన్నావు
బాధలొ ఓదార్పుగా సంతోషం లో బాగంగా
చేసే ప్రతి పని లో నువ్వే వున్నావు..
కానీ నేడు కనులు తెరిచి చూసే అంతదూరం లో లేవు నేస్తామా
ఈ దూరం శాశ్వతం కాదని మనసుకు తెలిసినా
ఎందుకో ఆది నీకోసం కలవరింత మాత్రం ఆపడం లేదు
పిచ్చి దానిలా నీ పలకరింపుకై
నీ చూపుకై ఎదురుచూస్తూనే ఉంది
ఓదార్చగా ఒక చిన్న మాట లా చెప్పి వెళ్లు నేస్తామా నీవు నాతోనే ఉన్నావని.
ఎప్పుడు వదిలివేళ్లవని.
నీకోసమై తపిస్తున్న ఈ పిచ్చిమనసు

నీ స్నేహం

కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు
ఆ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలోఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం

నీవే


నాలోని అణువణువూ నీవే

నా మనసు పలికే ప్రతి మాటలోనూ నువ్వే

నా నడకలోనూ నువ్వే

నా ఆశ నువ్వే

నా పీల్చే శ్వాస నీవే

ఒక మాటలో చెపుతున్నా

నా సర్వస్వం నువ్వే

నీ రూపం





నీ రూపం చూడని రోజు నాకొక నరకం

క్షణం ఒక యుగం,

ఇది అందామా లేక

నీ పై నా కున్నా బంధమా

ఉదయం కోసం నిదురానంతా వేచి చూసా

ఉదయిస్తే నిను చూడొచ్చని
నిద్ర రాని కంటికి సైతం కలల ఆశ చూపిస్తా

ఆ కలలో నీవోస్తావని

పరిచయం


పరిచయం

కొన్ని పరిచయాలు ఎక్కడ మొదలవుతాయో
ఎలా మొదలవుతాయో తెలియదు

ఎటు పయనిస్తాయో ముందే తెలియదు
తెలిసెలోపు పరిచయం ప్రాణం గానో

ప్రేమగానో ...స్నేహం గానో....పెళ్లిగానోలేక
ద్వేషంగానో పేరు మారిపోతుంది అదే అదే పరిచయం


Tuesday, November 24, 2009

ప్రియా


ప్రియా

కనపడని ఆ దేవుడు కి

ప్రతి రోజు విన్నపించుకుంటున్నా

.నా ఈ కనిపించే దేవత ని

చల్లా గా జీవితాంతం చూడాలి అని...

మ్రుక్కె ప్రతి క్షణంఆనందం

ఆ దేవుడు ఈ దేవత ని పంపాడు అని...

ఆనందం తో ఆనంద బాష్పాలతొ

మనస్సు ఎంతో హాయీగా ఉంటుంది.

ప్రియా.


కలలో అయిన వస్తావనినీ

వడిలో పడుకోబెట్టుకుంటావని.

ఎన్నో ఆశలతో నిదిరిస్తున్నా ప్రతి రాత్రి

మరువకు మరవకు నీ ప్రాణాన్ని దగ్గరకి రావటం

ప్రియా.


నీవు లేక, నిదుర లేక

మనస్సు లేక, మమత లేక

ఎంత కాలం ఈ జీవన యానాం

కదలలేక లేక,మెధలలేక

ఎంధూకోసమో ఈ జీవన రాగం

క్షణం ఒక యుగం గా

ఎన్నేలొ ఈ గాదంధకారం

ఎప్పుడో నాకీ సుప్రబాతం


ప్రియా


.నీతో గడిపిన క్షణాల్ని తలపులతో

నీవు పక్కన లేని ప్రతి క్షణం ఒక యుగం లాగా గడుపుతూ..............

బాధ


అనందానికి, సంతోషానికి ఒకే బాష
ఆది కనులకు సైతం తెలియని బాధ

మనసు మాత్రమే చెప్పగల మనో బాష

దానిపేరే కన్నీరు

కనులు చూపేను కన్నీరు

కానీ మనసు పడే మౌన కన్నీరు పేరే గుండెకోత

జీవితం




ప్రేమ ఒక వరం ఆది కరునిస్తే

ప్రేమ ఒక శాపం ఆది విఫలిస్థె

వరం అయూనా శాపం అయినా

అనుభవించాల్సిందే ఈ జీవితం

నేస్తం





నేస్తం అంటే నమ్మకం


స్నేహం అంటే జీవితం


జీవితం లో బ్రతకటానికి ఒక నమ్మకం కావాలి


ఆ నమ్మకం పేరే నేస్తం

ఆమ్మ ఆప్యాయత





స్రుష్టి లొ తొలి పరిచయం అమ్మ

మన జన్మ దాతువే అమ్మ

మన చిరు దరహాసాల కొసం

ఛిరకాలమ్ ఆశించు అమ్మ

బాధెమున్నా తనలొనే దాచేను

సంతొషా న్ని మనకు చూపేను

అమ్మ అనే పదం లొ నె వుంది అంతులేని ఆప్యాయత

అ ఆప్యాయతే కలకాలం మనకి మాత్రు రక్ష

అమ్మ

అమ్మ
ఆది లోని తోలి పిలుపు అమ్మ
అమృత వర్షపు అనురాగం అమ్మ
ఆత్మీయతలకు ఆలయం అమ్మ
అనురాగానికి ప్రతి రూపం అమ్మ

అమ్మ ప్రేమ


కనులు తెరచింది అమ్మ ఒడిలొ

నడత నెర్చింది అమ్మ నీడలొ
జీవితాన్ని ఇచింది అమ్మ

జీవమ్ పొసింది అమ్మ
బ్రతుకులొని తొలి మెట్టు అమ్మ

బ్రతుకంతా గడచిన తీరని రుణం అమ్మ
జన్మ ఉంటె కావలి అది అమ్మ తొడిదీ

బ్రతకాలి బ్రతుకన్తా అమ్మ చెంతన కలకాలం
ఏమిచ్చి తీర్చుకొను అమ్మ రుణం

అందుకేనా జీవితాన్ని అంకితం చేస్తానుఆమ్మ కొసం

అమ్మ

ఆది లోని తొలి పిలుపు అమ్మ
అమృత వర్షపు అనురాగం అమ్మ

ఆత్మీయతలకు ఆలయం అమ్మ

అనురాగానికి ప్రతి రూపం అమ్మ

ఆరాధన

నిన్నే ఆరాదిస్తున్నాను నా ప్రియతమా
నీకై ఆలాపిస్తున్నా అనుదినం
నీకై వెచే ప్రతి నిముషం
నాకో తీయటి అనుభవం
అక్షర ప్రేమలు జీవం పొసుకొని
కవితలు గా నిను ఆరాదిస్తున్నాయి
కలవరపడిన నా మనసుని చూసి
ఓదార్చ రావ నా హ్రుదయమా
పదే పదే గుర్తు వచ్హే నీ ప్రెమని మరచి నే మనగలనా
నేనడుగకనే గుండెలో చొటిచావు
నే అడుగుతున్నా చెన్తకు రాక వేదిస్తునావు సఖి
నీ ఆరాథనలొ ఆశలు పెన్చుకుంటున్న నీ ప్రియసఖి