Search This Blog

Monday, November 30, 2009

ఈ పిచ్చి మనసు

మనసులో నా తోనే వున్నావు .
మదిలో నా ప్రతి ఆలోచనలో నువ్వు ఉన్నావు
మౌనంగా ఉన్న క్షణం లో జ్ఞాపకానీవై ఉన్నావు
బాధలొ ఓదార్పుగా సంతోషం లో బాగంగా
చేసే ప్రతి పని లో నువ్వే వున్నావు..
కానీ నేడు కనులు తెరిచి చూసే అంతదూరం లో లేవు నేస్తామా
ఈ దూరం శాశ్వతం కాదని మనసుకు తెలిసినా
ఎందుకో ఆది నీకోసం కలవరింత మాత్రం ఆపడం లేదు
పిచ్చి దానిలా నీ పలకరింపుకై
నీ చూపుకై ఎదురుచూస్తూనే ఉంది
ఓదార్చగా ఒక చిన్న మాట లా చెప్పి వెళ్లు నేస్తామా నీవు నాతోనే ఉన్నావని.
ఎప్పుడు వదిలివేళ్లవని.
నీకోసమై తపిస్తున్న ఈ పిచ్చిమనసు

నీ స్నేహం

కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు
ఆ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలోఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం

నీవే


నాలోని అణువణువూ నీవే

నా మనసు పలికే ప్రతి మాటలోనూ నువ్వే

నా నడకలోనూ నువ్వే

నా ఆశ నువ్వే

నా పీల్చే శ్వాస నీవే

ఒక మాటలో చెపుతున్నా

నా సర్వస్వం నువ్వే

నీ రూపం





నీ రూపం చూడని రోజు నాకొక నరకం

క్షణం ఒక యుగం,

ఇది అందామా లేక

నీ పై నా కున్నా బంధమా

ఉదయం కోసం నిదురానంతా వేచి చూసా

ఉదయిస్తే నిను చూడొచ్చని
నిద్ర రాని కంటికి సైతం కలల ఆశ చూపిస్తా

ఆ కలలో నీవోస్తావని

పరిచయం


పరిచయం

కొన్ని పరిచయాలు ఎక్కడ మొదలవుతాయో
ఎలా మొదలవుతాయో తెలియదు

ఎటు పయనిస్తాయో ముందే తెలియదు
తెలిసెలోపు పరిచయం ప్రాణం గానో

ప్రేమగానో ...స్నేహం గానో....పెళ్లిగానోలేక
ద్వేషంగానో పేరు మారిపోతుంది అదే అదే పరిచయం


Tuesday, November 24, 2009

ప్రియా


ప్రియా

కనపడని ఆ దేవుడు కి

ప్రతి రోజు విన్నపించుకుంటున్నా

.నా ఈ కనిపించే దేవత ని

చల్లా గా జీవితాంతం చూడాలి అని...

మ్రుక్కె ప్రతి క్షణంఆనందం

ఆ దేవుడు ఈ దేవత ని పంపాడు అని...

ఆనందం తో ఆనంద బాష్పాలతొ

మనస్సు ఎంతో హాయీగా ఉంటుంది.

ప్రియా.


కలలో అయిన వస్తావనినీ

వడిలో పడుకోబెట్టుకుంటావని.

ఎన్నో ఆశలతో నిదిరిస్తున్నా ప్రతి రాత్రి

మరువకు మరవకు నీ ప్రాణాన్ని దగ్గరకి రావటం

ప్రియా.


నీవు లేక, నిదుర లేక

మనస్సు లేక, మమత లేక

ఎంత కాలం ఈ జీవన యానాం

కదలలేక లేక,మెధలలేక

ఎంధూకోసమో ఈ జీవన రాగం

క్షణం ఒక యుగం గా

ఎన్నేలొ ఈ గాదంధకారం

ఎప్పుడో నాకీ సుప్రబాతం


ప్రియా


.నీతో గడిపిన క్షణాల్ని తలపులతో

నీవు పక్కన లేని ప్రతి క్షణం ఒక యుగం లాగా గడుపుతూ..............

బాధ


అనందానికి, సంతోషానికి ఒకే బాష
ఆది కనులకు సైతం తెలియని బాధ

మనసు మాత్రమే చెప్పగల మనో బాష

దానిపేరే కన్నీరు

కనులు చూపేను కన్నీరు

కానీ మనసు పడే మౌన కన్నీరు పేరే గుండెకోత

జీవితం




ప్రేమ ఒక వరం ఆది కరునిస్తే

ప్రేమ ఒక శాపం ఆది విఫలిస్థె

వరం అయూనా శాపం అయినా

అనుభవించాల్సిందే ఈ జీవితం

నేస్తం





నేస్తం అంటే నమ్మకం


స్నేహం అంటే జీవితం


జీవితం లో బ్రతకటానికి ఒక నమ్మకం కావాలి


ఆ నమ్మకం పేరే నేస్తం

ఆమ్మ ఆప్యాయత





స్రుష్టి లొ తొలి పరిచయం అమ్మ

మన జన్మ దాతువే అమ్మ

మన చిరు దరహాసాల కొసం

ఛిరకాలమ్ ఆశించు అమ్మ

బాధెమున్నా తనలొనే దాచేను

సంతొషా న్ని మనకు చూపేను

అమ్మ అనే పదం లొ నె వుంది అంతులేని ఆప్యాయత

అ ఆప్యాయతే కలకాలం మనకి మాత్రు రక్ష

అమ్మ

అమ్మ
ఆది లోని తోలి పిలుపు అమ్మ
అమృత వర్షపు అనురాగం అమ్మ
ఆత్మీయతలకు ఆలయం అమ్మ
అనురాగానికి ప్రతి రూపం అమ్మ

అమ్మ ప్రేమ


కనులు తెరచింది అమ్మ ఒడిలొ

నడత నెర్చింది అమ్మ నీడలొ
జీవితాన్ని ఇచింది అమ్మ

జీవమ్ పొసింది అమ్మ
బ్రతుకులొని తొలి మెట్టు అమ్మ

బ్రతుకంతా గడచిన తీరని రుణం అమ్మ
జన్మ ఉంటె కావలి అది అమ్మ తొడిదీ

బ్రతకాలి బ్రతుకన్తా అమ్మ చెంతన కలకాలం
ఏమిచ్చి తీర్చుకొను అమ్మ రుణం

అందుకేనా జీవితాన్ని అంకితం చేస్తానుఆమ్మ కొసం

అమ్మ

ఆది లోని తొలి పిలుపు అమ్మ
అమృత వర్షపు అనురాగం అమ్మ

ఆత్మీయతలకు ఆలయం అమ్మ

అనురాగానికి ప్రతి రూపం అమ్మ

ఆరాధన

నిన్నే ఆరాదిస్తున్నాను నా ప్రియతమా
నీకై ఆలాపిస్తున్నా అనుదినం
నీకై వెచే ప్రతి నిముషం
నాకో తీయటి అనుభవం
అక్షర ప్రేమలు జీవం పొసుకొని
కవితలు గా నిను ఆరాదిస్తున్నాయి
కలవరపడిన నా మనసుని చూసి
ఓదార్చ రావ నా హ్రుదయమా
పదే పదే గుర్తు వచ్హే నీ ప్రెమని మరచి నే మనగలనా
నేనడుగకనే గుండెలో చొటిచావు
నే అడుగుతున్నా చెన్తకు రాక వేదిస్తునావు సఖి
నీ ఆరాథనలొ ఆశలు పెన్చుకుంటున్న నీ ప్రియసఖి