ఆశయాల గురించి నిదురలో కలగంటున్న
నిడురలేవగానే మరుస్తునా
బాధ విన్నప్పుడు చలిస్తున్నా
మల్లి మరస్తున్నా
కర్తవ్యానికి పునాది వేయాలని
ప్రతి రోజు ప్రయత్నిస్తున్న
ప్రయత్నిస్తునేవున్నా!
కాలం వేగంగా పరిగేడుతుండా
కదిలే కాలానికి నేను అనుకూలంగా లేనా?
ఏదో ఆలోచన
ఇంకేదో అసంతృప్తి
మనసు నను ప్రశ్నిస్తుంది నీ ఆశలు మరిచావా అని
లేదంటే అంతరాత్మ ఎదురు తిరిగి నిందిస్తుంది నిజం చెప్పలేదని
ఏమో మరిచానేమో
లేదంటే చలనం లేని జీవం లా
ఎలా నిడురిస్తాను ప్రతి రాత్రి
లేవాలి, మేలుకోవాలి
ఇకనైనా కనులు తెరుచుకొని
గమ్యాన్ని గుర్తుచేసుకోవాలి
పరుగులు తీయాలి .
No comments:
Post a Comment