
సాయమన్నది మరచి పోతుంది ఈ తరం
బందాలంటూ , బాధ్యతలంటూ తమలో తామే
తమకోసమే అన్నట్టు బ్రతికేస్తుంటారు
పక్కవాడి పేగుల చెప్పుడు వినిపిస్తున్న
మనకెందుకులే అనుకుంటే గడిపేస్తాము
ఉదయం మొదలు రాత్రివరకు పరుగులు
ఏదో ఏదో చెయ్యాలని ఏదో ఏదో చేసేస్తున్నామని అనుకోనేస్తారు
ప్రేమలు పంచుకోవటానికి సమయం ఉండదు
సంతోషంగా ఉండటానికి సమయం ఉండదు
బిజీ బిజీ గా గజి బిజీ గా కాలం గడిపేస్తుంటారు
వారికే అర్థం కాని ఈబిజీ ఎవరికోసమో...?