ఎప్పటికప్పుడు జీవితానికికొత్త సంవత్సరం మహా గొప్పగా ఉంటుంది
పాత చెత్తను ఉడ్చేస్తూ
కొత్త చెత్తను ఎంచుకొని
ఇరావైలోనో...... అరావైలోనో "ఎప్పటికప్పుడు"
మార్పులేని కాలంతో
మారని బ్రతుకులతొ
నిత్య దిన చర్యతో
ఒక్కోసారో.........వందసార్లొ " ఎప్పటికప్పుడు"
చెదరని రాతలతో
తీరని కష్టాలతో
మార్పు లేని జీవితంలో
నీకైనా,,,,,, నాకైనా,,,,,,,ఎవరికైనా " ఎప్పటికప్పుడు"
కొత్త కొత్త ఆశలతొ
కొత్త కొత్త ఆశయాలతో
మళ్లీ మళ్లీ " ఎప్పటికప్పుడు"
కొత్త సంవత్సరం గురుంచి ఆలోచించొద్దు
వచ్చిన తర్వాత పాత సంవత్సరమే కదా