Search This Blog

Tuesday, February 21, 2012

ఎవరికోసమో...?

స్వార్థం లా పెరుగుతుంది సమాజం
సాయమన్నది మరచి పోతుంది ఈ తరం
బందాలంటూ , బాధ్యతలంటూ తమలో తామే
తమకోసమే అన్నట్టు బ్రతికేస్తుంటారు
పక్కవాడి పేగుల చెప్పుడు వినిపిస్తున్న
మనకెందుకులే అనుకుంటే గడిపేస్తాము
ఉదయం మొదలు రాత్రివరకు పరుగులు
ఏదో ఏదో చెయ్యాలని ఏదో ఏదో చేసేస్తున్నామని అనుకోనేస్తారు
ప్రేమలు పంచుకోవటానికి సమయం ఉండదు
సంతోషంగా ఉండటానికి సమయం ఉండదు
బిజీ బిజీ గా గజి బిజీ గా కాలం గడిపేస్తుంటారు
వారికే అర్థం కాని ఈబిజీ ఎవరికోసమో...?


ఒక్కటే



చావు ఎరుగనిది ,ఆశ ఒక్కటే


అలుపెరగానిది ,కోరిక ఒక్కటే


గమ్యం ఎరుగనిది ,బ్రతుకు ఒక్కటే


ఊదార్పు ఎరుగనిది, ఒంటరి తనమొక్కటే


అంతు ఎరుగనిది , ఆకాశం ఒక్కటే


నిర్మలమైనది , నీ మనసు ఒక్కటే


ఎత్తుఐనది ,నీ మేధస్సు ఒక్కటే,


లోతైనది విజ్ఞానం ఒక్కటే,


విశాలమైనది ప్రేమ ఒక్కటే.

స్నేహమే నీకు తోడు

బందాలకు అతీతమైన బంధం ఓ అనుబంధం


తోదపుట్టినానీ తోడై రారు ఎవ్వరు !


కలిసి పెరిగినా కడవరకు రారు నీ వారు
వయసు పేరుతో భావాలు


బాద్యతల పేరుతో బంధాలు
దూరమవుతూనే ఉంటాయీ , నిను ఒంటరిని చేస్తూ


ఆ సమయం , ఎ సమయం ఎపుడు నీకు తోడు ఉండేది నీ స్నేహితుడు మాత్రమె
జీవం , జీవితం ఉన్నంతవరకు స్నేహమే నీకు తోడు .

కర్తవ్యం

ఆశయాల గురించి నిదురలో కలగంటున్న
నిడురలేవగానే మరుస్తునా
బాధ విన్నప్పుడు చలిస్తున్నా
మల్లి మరస్తున్నా
కర్తవ్యానికి పునాది వేయాలని
ప్రతి రోజు ప్రయత్నిస్తున్న
ప్రయత్నిస్తునేవున్నా!
కాలం వేగంగా పరిగేడుతుండా
కదిలే కాలానికి నేను అనుకూలంగా లేనా?
ఏదో ఆలోచన
ఇంకేదో అసంతృప్తి
మనసు నను ప్రశ్నిస్తుంది నీ ఆశలు మరిచావా అని
లేదంటే అంతరాత్మ ఎదురు తిరిగి నిందిస్తుంది నిజం చెప్పలేదని
ఏమో మరిచానేమో
లేదంటే చలనం లేని జీవం లా
ఎలా నిడురిస్తాను ప్రతి రాత్రి
లేవాలి, మేలుకోవాలి
ఇకనైనా కనులు తెరుచుకొని
గమ్యాన్ని గుర్తుచేసుకోవాలి
పరుగులు తీయాలి .







జీవితం

జీవితమంటే సౌందర్యం అని నిద్రపోయినప్పుడు కల గన్నాను
అయితే



నిద్రలేచాకే గ్రహించాను జీవితమంటే కర్తవ్యం అని.







Love



నీ తోడు