Telugu Kavithalu
Search This Blog
Friday, April 16, 2010
ఈ పిచ్చి హృదయం
ఉప్పెనలా వచ్చే ప్రేమని గుప్పటిలో తీసుకొనే హృదయం
గుప్పటి ద్వేశానికి ఉప్పెనై ఉక్కిరి బిక్కిరై పోతుంది
అంతులేని ప్రేమని తీసుకొనే హృదయం
అణువంతైనా నిర్లక్ష్యాన్ని బరించలేదు
ఈ పిచ్చి హృదయం
ప్రియా
ఎగసే ప్రతి కెరటం సాక్షి గా
నిను ప్రేమిస్తున్నా
వికసించే పువ్వులలో
నీ నవ్వులు చూస్తున్నా
గుండె పిలుపు వింటేగుప్పున ఎగసే ఊపిరికూడా
నీకై ఆపేస్తున్నా ప్రియా
నీ ద్యాసలో
రెక్కలు కట్టుకొని ఆ నింగికి ఎగసి
నిను చేరాలని
అల్లరి పలుకులతో నిను మురిపిస్తూ అల్లుకు పోవాలని
ఉహలలో విహరించి విహరించి
అలసి సొలసి నీ వడిలో చేరిపోవాలని
ఇన్నాళ్ళ ఈ నిరీక్షణ ఈ క్షణం
తీరిపోవాలని
ఆశ పడుతుంది హృదయం పదే పదే
నీ ద్యాసలో
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)