Search This Blog

Friday, April 16, 2010

ఈ పిచ్చి హృదయం




ఉప్పెనలా వచ్చే ప్రేమని గుప్పటిలో తీసుకొనే హృదయం
గుప్పటి ద్వేశానికి ఉప్పెనై ఉక్కిరి బిక్కిరై పోతుంది
అంతులేని ప్రేమని తీసుకొనే హృదయం
అణువంతైనా నిర్లక్ష్యాన్ని బరించలేదు
ఈ పిచ్చి హృదయం

ప్రియా


ఎగసే ప్రతి కెరటం సాక్షి గా
నిను ప్రేమిస్తున్నా
వికసించే పువ్వులలో
నీ నవ్వులు చూస్తున్నా
గుండె పిలుపు వింటేగుప్పున ఎగసే ఊపిరికూడా
నీకై ఆపేస్తున్నా ప్రియా

నీ ద్యాసలో


రెక్కలు కట్టుకొని ఆ నింగికి ఎగసి

నిను చేరాలని

అల్లరి పలుకులతో నిను మురిపిస్తూ అల్లుకు పోవాలని

ఉహలలో విహరించి విహరించి

అలసి సొలసి నీ వడిలో చేరిపోవాలని

ఇన్నాళ్ళ ఈ నిరీక్షణ ఈ క్షణం

తీరిపోవాలని

ఆశ పడుతుంది హృదయం పదే పదే

నీ ద్యాసలో

Wednesday, March 31, 2010

ఈ ప్రేమ


మనసు అనే తెల్లని కాగితం మీదచెరిగిపోనీ అక్షరం ఈ ప్రేమ
పువ్వులా వికసిస్తుంది శాశ్వతామై నిలచి పోతుంది
నీ హృదయాంతరాలలో
గెలుపు ఓటములు మనిషి కి తెలుసు
చావు పుట్టుకలు దేహానికి తెలుసు
వికసించటమే కానీ
వాడిపోవటం తెలియని అపురూప పుష్పం ఈ ప్రేమ

Thursday, March 11, 2010

అక్షర


దీపం అనే వెలుగులో ప్రేమ తో వికసించిన అమోఘ్ మైన పుష్పం "అక్షర"

Tuesday, March 9, 2010

సమయ్

ఆ నింగిని విడిచి "రవి" కిరణాలు
నేల పై" హిమబిందువులతో" చేరి
ఆయువై నిలచిన మా "సమయ్"
ఎన్నో" విజయాలతో" "రతనాల" సింహాసనాన్ని
ముక్తి తో చేరుకొనిరాజు లా రారాజులా కలకాలం మా మనసులలో నిలాచిపోవాలి

Monday, January 4, 2010

నెస్తమా


నీ పరిచయం తో పునర్జన్మను ప్రసాదించావు
నీ దూరంతో నేడు నిర్జీవమై మిగిలున్నాను నెస్తమా
ఎడారి గా మారిన ఈ హృదయం మళ్లీ నీ రాకతోనే వసంతం చూస్తుంది
నవ్వులు మరచిన ఈ మనసులు నీ రాకతోనే ఇక నవ వసంతాన్ని చూసేది
అప్పటివరకు నీ క్షేమం కోరూతూ నీకై ఎదురుచూపు